సంక్రాంతి సంబరాలు.. పెదరావూరు గ్రామానికి చేరుకున్న పవన్ కల్యాణ్

  • తెనాలిలోని పెదరావూరులో వేడుకలు 
  • నంది వెలుగు- పెదరావూరు వరకు భారీ ర్యాలీ
  • భోగి సంబరాల్లో పాల్గొననున్న పవన్ 
తెనాలిలోని పెదరావూరులో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా నందివెలుగు నుంచి పెదరావూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సంక్రాంతి పండగ సందర్భంగా పెదరావూరులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైతులు, మహిళలు, యువతతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ‘జాగోరే జాగో’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం, భోగి సంబరాల్లో పవన్ పాల్గొంటారని సమాచారం. 
Go Back to Shorts
sankranthi
tenali
pedaravuru
Jana Sena
pk

More Telugu News